NLR: సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోమవారం తోటపల్లి గూడూరు మండలంలో పర్యటించారు. అనంతరం మండలంలోని వరిగొండ గ్రామంలో అర్హులైన పెన్షన్ లబ్ధిదారులకు ఇంటింటికి తిరుగుతూ పెన్షన్ నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వ పాలన కొనసాగుతుందన్నారు. ఇంకా మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు.