అనకాపల్లి: అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా జిల్లాలో శత శాతం అక్షరాస్యత సాధించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ సూచించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లో అక్షరాంధ్ర కార్యక్రమంపై సమీక్షించారు. 93,056 మంది నిరక్షరాస్యలను గుర్తించామన్నారు. వీరికి చదువు చెప్పేందుకు 9,351 మంది వాలంటీర్లను నియమించామన్నారు. చదవడం, రాయడం, లెక్కలు చేయడం నేర్పించాలన్నారు.