సత్యసాయి: పరిగి మండలంలో రూ. 2.10 కోట్ల నిధులతో పలు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆదివారం భూమి పూజ చేశారు. మండల టీడీపీ కన్వీనర్ గోవింద రెడ్డి మాట్లాడుతూ.. పాపిరెడ్డిపల్లి నుంచి శ్రీరంగరాజుపల్లి వరకు రూ.1.20 కోట్లు, మధుగిరి రోడ్డు నుంచి పుట్టగూర్లపల్లి వరకు రూ. 90 లక్షల వ్యయంతో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.