KDP: ఖాజీపేట మండలంలోని వివిధ ప్రాంతాలలో విద్యుత్ బకాయిల వసూళ్ల కోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు మండల విద్యుత్ ఇంజినీర్ నాగరాజు బుధవారం తెలిపారు. గురువారం ముత్తులూరుపాడులో ఉదయం 9 గంటలకు, బుడ్డాయిపల్లెకు ఉదయం 11 గంటలకు ప్రత్యేక సిబ్బంది రానున్నారని, బకాయి దారులు బిల్లులు చెల్లించాలన్నారు. బకాయిలు చెల్లించకపోతే సప్లై ఆపేస్తామని హెచ్చరించారు.