TPT: వరదయ్యపాలెం మండల అభివృద్ధే ధ్యేయంగా అందరూ కలిసి పనిచేయాలని ఎమ్మెల్యే ఆదిమూలం పిలుపునిచ్చారు. శుక్రవారం జరిగిన మండల సాధారణ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మండలంలో అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులను గుర్తించి ప్రతిపాదనలు పంపాలని తెలిపారు.