తూ.గో: సీతానగరం మండలం రఘుదేవపురంలో ఈ నెల 13న భార్య సుబ్బలక్ష్మిని హత్య చేసి, తాను కూడా చనిపోవడానికి యత్నించిన కోట నూకరాజును సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. కుమారుడు చనిపోయాక కోడలు, మనవళ్లను పోషించలేననే మనస్తాపంతో నూకరాజు ఈ దారుణానికి ఒడిగట్టాడని వారు తెలిపారు. ఆసుపత్రిలో కోలుకున్న నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు కోరుకొండ CI మూర్తి తెలిపారు.