KDP: బద్వేలు పరిధిలోని చెన్నంపల్లెలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 436 బస్తాల రేషన్ బియ్యాన్ని గురువారం రాత్రి విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోలయ్య అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి, బియ్యాన్ని MLS పాయింటుకు తరలించారు. విజిలెన్స్ అధికారి శ్రీనివాసులు రెడ్డి, ఎన్ఫోర్స్మెంట్ DT శివశంకర్, ఫుడ్ ఇన్స్పెక్టర్ గీతా ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు.