సత్యసాయి: పుట్టపర్తిలో ప్రముఖ సామాజిక సంస్కర్త, శెట్టిబలిజ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలను కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం దొమ్మేటి వెంకటరెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ పేర్కొన్నారు.