ASR: బక్రీద్ పండుగ సందర్భంగా ఎవరైనా గోవులను, చిన్న పెయ్యలను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జీకేవీధి సీఐ సుధాకర్ హెచ్చరించారు. బుధవారం రాత్రి సీలేరు ఏపీ జెన్కో చెక్ పోస్టు వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ప్రతీ వాహనాన్ని నిలిపి వేసి క్షుణ్ణంగా తనిఖీ చేసి విడిచిపెట్టారు. గోవులు రవాణా జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు సీఐ తెలిపారు.