కోనసీమ: అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారంలో మంగళవారం మధ్యాహ్నం పురాతన రావిచెట్టు భారీ కొమ్మ విరిగిపడి రోడ్డుపై వెళ్తున్న ఐచర్ వ్యాన్ పై పడింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. భారీ శబ్దం రావడంతో గమనించిన స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్యాబిన్లో ఇరుక్కున్న వ్యక్తిని బయటకు తీసి 108 అంబులెన్స్‌లో అమలాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.