E.G: ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలోని వై.జంక్షన్ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్ట్స్ కళాశాలలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేసీ వై.మేఘా స్వరూప్ హాజరై మాట్లాడారు. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా క్షయవ్యాధి గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించడం ముఖ్య ఉద్దేశం అన్నారు.