ATP: ప్రమాదంలో మరణించిన గుంతకల్లు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ముల్లా ఖుషిద్ కుటుంబానికి రూ.5 లక్షల బీమా చెక్కును శనివారం టీడీపీ మండల ఇంఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ అండగా నిలుస్తున్నారని అన్నారు.