VZM: రైతన్నలకు సాగు పద్ధతులపై అవగాహన కల్పించి, వారిని సాంకేతికంగా బలోపేతం చేసే దిశగా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి కీలక అడుగు వేశారు. ఆదివారం పూసపాటిరేగ మండలం రెల్లివలస పంచాయతీలో నూతనంగా నిర్మించిన ఫార్మర్స్ లెర్నింగ్ సెంటర్ (రైతు శిక్షణ కేంద్రం)ను ఆమె రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.