AKP: రంజాన్ సందర్భాన్ని పురస్కరించుకొని గత నెల 21వ తేదీన జరగాల్సిన ఇంగ్లీష్ పరీక్ష వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష ఈనెల రెండవ తేదీన జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి గిడ్డి అప్పారావు నాయుడు బుధవారం తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు. కాగా రేపటితో పదో తరగతి పరీక్షలు పూర్తవుతున్నట్లు పేర్కొన్నారు.