KKD: కాకినాడ పి.ఆర్. బాయ్స్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల నమోదు (ఎన్రోల్మెంట్) పెంచేందుకు సీనియర్ ఉపాధ్యాయులు, ఎంఈవో కె. సతీశ్ బాబు ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. సతీశ్ బాబు, చెల్లారావు, ఇతర ఉపాధ్యాయులు స్థానిక ప్రాంతాల్లో పర్యటించి, ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులపై అవగాహన కల్పించారు.