»Chandrababu Ycp Will Not Survive Without Rowdyism
Chandrababu: రౌడీయిజం చేయకపోతే వైసీపీకి పూట గడవదు
ఓటమి భయంతో వైసీపీ హింసా రాజకీయాలు చేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. టీడీపీ నేత మోహన్‌రావుపై ఒంగోలులో వైసీపీ దాడి చేశారు. ఈ ఘటనను చంద్రబాబు ఖండించారు.
Chandrababu: ఓటమి భయంతో వైసీపీ హింసా రాజకీయాలు చేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. టీడీపీ నేత మోహన్‌రావుపై ఒంగోలులో వైసీపీ దాడి చేశారు. ఈ ఘటనను చంద్రబాబు ఖండించారు. వైసీపీకి రౌడీయిజం చేయకపోతే పూట గడవదు అన్నట్లు వ్యవహరిస్తోందని తెలిపారు. ప్ర్రచారంలో పాల్గొన్న వాలంటీర్‌ను ప్రశ్నిస్తే బెదిరిస్తారా? టీడీపీ కార్యకర్త ప్రభావతి కుటుంబాన్ని వైసీపీ రౌడీమూక చంపేస్తామని బెదిరించింది. ఆమెకు అండగా నిలిచిన టీడీపీ నేత మోహన్‌పై దాడి చేశారు. ఇలా చేయడం కరెక్టేనా? టీడీపీ వాళ్లపై వైసీపీ దాడులు చేస్తుందని చంద్రబాబు అన్నారు.
చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్తే అక్కడ బీభత్సం సృష్టించారు. అక్కడ పోలీసులు ఉన్నారు. కానీ వాళ్లు అడ్డుకునే ప్రయత్నం చేయలేదన్నారు. ఈ ఘటనకు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డే కారణమంటున్నారు. అధికార పార్టీకి సాయం చేస్తున్న కొందరు పోలీసులపై ఈసీ దృష్టి పెట్టాలని చంద్రబాబు తెలిపారు. దాడి చేసిన రౌడీలపై ప్రకాశం జిల్లా ఎస్పీ కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.