PLD: శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా క్రోసూరు మండలం అనంతవరంలో డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో 80 మంది పోలీసులు మంగళవారం కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 38 ద్విచక్ర వాహనాలు, గొడ్డళ్లు, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. నేర రహిత సమాజం కోసం ప్రజలు సహకరించాలని డీఎస్పీ కోరారు.