TPT: వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణనును శుక్రవారం పెంచలకోన శ్రీ పెనుశిల నరసింహ స్వామి దేవస్థానం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 27వ తేదీ నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యేకు అందజేసి, ఉత్సవాలకు హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆశీర్వచనాలు అందజేయగా, MLAను పూలమాల, శాలువాతో సత్కరించారు.