NLR: ఉదయగిరి ఎంపీడీవో కార్యాలయ ఆవరణలోని దళితవాడ పాఠశాలను ఎంఈవో తోట శ్రీనివాసులు శుక్రవారం సందర్శించారు. ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్లు, పలు రికార్డులను ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకం అమలు తీరు, రికార్డులు నిర్వహణపై పరిశీలన చేశారు. నాణ్యమైన ఆహారాన్ని అందించాలని నిర్వాహకులకు సూచించారు.