ASR: జిల్లాలో ప్రజా పరిష్కార వేదిక ద్వారా వచ్చిన అర్జీలు, రెవెన్యూ క్లినిక్ ద్వారా ప్రజల నుండి అందిన అర్జీలను నిర్ణీత కాలపరిమితిలోగా పరిష్కరించాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈమరకు ఆయన గురువారం అల్లూరి, పోలవరం జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో అధికారులు అర్జీలు పెండింగ్లో ఉంచకుండా, ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు.