PPM: గిరిజన ప్రాంతాల ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడమే లక్ష్యంగా ఐటీడీఏ పనిచేస్తుందని జాల్లా ఐటీడీఏ ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ అధికారి సి.యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇవాళ స్థానిక ఐటీడీఏ కార్యాలయంలోని గిరిమిత్ర హాల్లో నిర్వహించిన గిరిజన సమస్యల పరిష్కార వేదికలో ఆయన పాల్గొని ఏడుగురు గిరిజనుల నుంచి అర్జీలను స్వీకరించారు.