నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌పై YCP దుష్ప్రచారం చేస్తోందని MP వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రోన్ టెస్టింగ్ కోసమే సాగర్ డిఫెన్స్ కంపెనీకి భూమి ఇచ్చిందని.. దీంతో మత్స్యకారులకే ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. వారికి అన్యాయం చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని.. YCP తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు సూచించారు.