ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడిలో నిన్న సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి మొక్కజొన్న పంట నేల వాలింది. చేతికి రావాల్సిన పంట చేతికి రాకుండా పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ వర్షం మామిడి, మొక్కజొన్న, మిర్చి రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని రైతులు వాపోయారు.