PLD: భారత జనగణన–2027 కార్యక్రమంలో భాగంగా స్వీయ గణనపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు నరసరావుపేట పట్టణంలో ఈ నెల 26వ తేదీ ఉదయం 7.00 గంటలకు “సెన్సస్ 5కే రన్” నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. 5కే రన్ కోడెల శివప్రసాద్ స్టేడియం నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. జనగణన–2027 స్వీయ గణన కార్యక్రమంపై ప్రజల్లో చైతన్యం కావాలన్నారు.