VKB: కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని హస్నాబాదుకు చెందిన సాయికిరణ్ షాట్‌పుట్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ నెల 24న కర్ణాటకలోని తుముకూరు స్టేడియంలో నిర్వహించిన అండర్ 20వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఫైనల్ పోటీల్లో సాయికిరణ్ 18.65 మీటర్ల దూరంలో విసిరి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచాడు.