BPT: అద్దంకి పట్టణంలో పైపుల మరమ్మత్తు పనులు చేపట్టిన నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 4వ వార్డు, 10వ వార్డుల్లో నీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేశారు. మరమ్మత్తు పనులు పూర్తయ్యే వరకు నీటి సరఫరా ఉండదని అధికారులు తెలిపారు. పనులు పూర్తయిన వెంటనే నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.