NDL: డోన్ ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో రేపు ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్షిప్ మేళా, జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ నాగకేశవ ఓ ప్రకటనలో తెలిపారు. అమరరాజా ఎనర్జీ మొబిలిటీ (చిత్తూరు)తో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు ప్రముఖ కంపెనీలు పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయన్నారు. ఐటీఐ ఉత్తీర్ణులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు.