KRNL: ఎమ్మిగనూరులో దళిత, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న రంగయ్య డాక్టర్ B.R.అంబేద్కర్ విశిష్ట సేవా రత్న అవార్డుకు ఎంపిక అయ్యాడు. దీంతో పలువురు ప్రముఖులు, ఉద్యమకారులు, సామాజికవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. గురువారం రంగయ్య మాట్లాడుతూ.. ఈ గుర్తింపు తనపై మరింత బాధ్యతను పెంచిందని, పేదల పక్షాన నిబద్ధతతో ముందుకు సాగుతానని తెలిపారు.