E.G: గోపాలపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. మొదటి సంవత్సరం (BIPC)లో ఎల్.పావని 444/455 మార్కులతో ప్రథమ స్థానం సాధించింది. 2వ సంవత్సరం (MPC)లో కె.రామచరణ్ 829/1000 మార్కులు సాధించాడు. ఈ విద్యా సంవత్సరంలో కళాశాల 83% ఉత్తీర్ణత సాధించింది.