ELR: తడికలపూడి గ్రామంలో ప్రజలకు పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై వల్లి పద్మ మాట్లాడుతూ.. సైబర్ నేరాలకు గురికాకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారి ఫోన్లోకి వచ్చే ఓటిపిలను ఎవరితోను షేర్ చేయవద్దన్నారు. సమాజంలో మహిళలు, చిన్నారులపై జరిగే అఘాయిత్యాలను అరికట్టడంలో ప్రజలు సహకరించాలని కోరారు.