అన్నమయ్య: రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అజ్ఞాతం వీడి ప్రజా సేవకు వచ్చారు. 3నెలల క్రితం ఎమ్మెల్యేపై ఓ మహిళ ఆరోపణలు పెను దుమారం రేపాయి. పార్టీ పరంగా ఆయనను దూరం పెట్టారు. ఎలాంటి కార్యక్రమాల్లో ఆయన కనిపించలేదు. అసెంబ్లీకి సైతం వెళ్లలేదు. అకాల వర్షాల కారణంగా ఓబులవారిపల్లిలో దెబ్బతిన్న అరటి రైతులను శుక్రవారం అధికారులతో కలిసి ఆయన సందర్శించారు.