NDL: చైత్ర మాస పౌర్ణమి తర్వాత వచ్చే తొలి మంగళ లేదా శుక్రవారంలో శ్రీ భ్రమరాంబాదేవికి కుంభోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఏడాది ఏప్రిల్ 7న ఉత్సవం జరగనుంది. ఇందులో భాగంగా శుక్రవారం అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించారు. ఆలయ ప్రదక్షిణ మండపంలో వాటిని రాశిగా పోసి పసుపు, కుంకుమలతో శాస్త్రోక్తంగా పూజలు చేశారు. భక్తిశ్రద్ధల మధ్య కార్యక్రమం పూర్తైనట్లు అర్చకులు తెలిపారు.