తిరుమలలో గురువారం భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద 25 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. నిన్న మొత్తం 73,035 మంది శ్రీవారిని దర్శించుకోగా, 27,090 మంది తలనీలాలు సమర్పించారు. అదే రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.48 కోట్లుగా నమోదైంది.