BPT: పర్చూరు మండలం నూతలపాడు గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి మరో అడుగు పడింది. రూ.10 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులను శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మద్దతు అందించగా, PACS ఛైర్మన్ విన్నకోట సతీష్, స్థానిక నాయకులు కలిసి పనులకు శ్రీకారం చుట్టారు.