MNCL: మంచిర్యాలలోని మంగళవారం హిందూ సంఘాల ఆధ్వర్యంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా హిందూ ఉత్సవ సమితి కార్యదర్శి కర్ణకంటి రవీందర్ మాట్లాడుతూ.. ప్రకాష్ రాజ్ ఇటీవల హిందూ దేవతామూర్తులను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో హిందువుల మనోభావాలను కించపరిస్తే సహించేది లేదన్నారు.