కృష్ణా: కంకిపాడు మార్కెట్ యార్డులో మినువులు, పెసలు కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన 18 కోట్లు కూటమి ప్రభుత్వం ఇచ్చిందని అన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని తెలిపారు.