KRNL: ఎమ్మిగనూరు మండలం బనవాసి గ్రామం వద్ద నిర్మాణంలో ఉన్న MSME ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్ పార్క్‌ను MLA బి.వి. జయనాగేశ్వర రెడ్డి ఇవాళ సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్ రంగ అభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ కీలకమని పేర్కొన్నారు. పార్క్ స్థాపన ద్వారా చేనేతలకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు.