TPT: సూళ్లూరుపేట ఇన్ఛార్జ్ ఆర్డీఓగా శ్రీ వీ.దేవేంద్ర రెడ్డి గారు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రెవెన్యూ పరిపాలన, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై చర్చించారు. ప్రభుత్వం నిర్దేశించిన విధానాలకు అనుగుణంగా సమర్థవంతమైన సేవలు అందిస్తానని ఆయన తెలిపారు.