కృష్ణా: ఘంటసాల మండలం లంకపల్లి జడ్పీ హైస్కూలును ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి పఠన సామర్ధ్యం పరిశీలించారు. మెనూ అమలు తీరు ఆరా తీశారు. ఉపాధ్యాయులతో మాట్లాడి పాఠశాల అవసరాలు తెలుసుకున్నారు. అసంపూర్తిగా ఉన్న అదనపు తరగతుల భవనం పరిస్థితి పరిశీలించారు. టీడీపీ నేత దిరిశం వెంకట్రావ్ పాల్గొన్నారు.