ASR: ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వేరుశనగ సాగు చేసి, అధిక దిగుబడులు సాధించాలని చింతపల్లి ఏడీఏ తిరుమలరావు రైతులకు సూచించారు. సోమవారం ఏవో మధుసూదనరావుతో చౌడుపల్లి, పశువులబంధ గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామాల రైతులు, వ్యవసాయ సిబ్బందితో కలిసి అక్కడ సాగు చేస్తున్న వేరుశనగ పంట పరిశీలించారు. ఖరీఫ్ సీజన్లో కూడా వేరుశనగ సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలన్నారు.