E.G: వేసవి ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ జగదీష్ కృష్ణ సూచించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో తిరగకుండా మజ్జిగ, ORS, పళ్లరసాలు తీసుకోవాలని తెలిపారు. పడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రానికి తరలించాలని సూచించారు.