KRNL: ఈ ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్‌లో గత ర్యాంక్ కంటే మెరుగైన ఫలితాలు సాధించి జిల్లాకు అవార్డులు తెచ్చేలా పనిచేయాలని శనివారం కలెక్టర్ డా.సిరి మున్సిపల్ కమిషనర్లకు ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో పారిశుద్ధ్యం, సాలిడ్-లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, టాయిలెట్ల నిర్వహణ, తాగునీటి సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వీధుల పరిశుభ్రత ముఖ్యమన్నారు.