గుంటూరు జాతీయ రహదారిపై అనధికారికంగా నిర్వహిస్తున్న హోల్సేల్ కూరగాయల దుకాణాలను నగరపాలక సంస్థ అధికారులు సోమవారం తొలగించారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు, కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశాలతో టౌన్ ప్లానింగ్ విభాగం ఈ చర్యలు చేపట్టింది. రైతులు తమ కూరగాయలను నిర్ణీత ‘కొల్లి శారద హోల్సేల్ మార్కెట్’లోనే విక్రయించాలని కమిషనర్ స్పష్టం చేశారు.