SRPT: రబీ సీజన్లో ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. 20 జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాగా, సాగు ఆలస్యం కారణంగా మరో 13 జిల్లాల్లో ప్రక్రియ ఇంకా మొదలు కాలేదని తెలిపారు. ప్రభుత్వం ఈ సీజన్ లో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.