SRPT: అనంతగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో శనివారం మలేరియా దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. వైద్యాధికారి డాక్టర్ ఫిరోజ్ మాట్లాడుతూ.. అనాఫిలిస్ అనే ఆడ దోమలు కుట్టడం వల్ల మలేరియా జ్వరాలు వస్తాయని అన్నారు. వ్యాధి సోకిన వారికి వణుకుతో కూడిన తీవ్రమైన చలి జ్వరం, వాంతులు, చెమటలు పోయుట, తలనొప్పి, ఒళ్లు నొప్పులు లక్షణాలు ఉంటాయన్నారు.