నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగిన క్రీడా పోటీల్లో కమ్మర్పల్లి వాలీబాల్ జట్టు ప్రథమ స్థానం సాధించింది. ఉమెన్స్ కళాశాల మైదానంలో జరిగిన ముగింపు వేడుకలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీపీ సాయి చైతన్య విజేతలకు రూ.20 వేల నగదు బహుమతిని అందజేసి అభినందించారు.