MBNR: శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ అన్నారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన ఉత్సవాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనను ఆలయ కమిటీ వారు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కందమూరి బ్రహ్మయ్య, పాండా చారి, శ్యామ్ పాల్గొన్నారు.