గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాకు మరో అరుదైన గౌరవం దక్కింది. గోల్డ్ హౌస్ సంస్థ ఆమెకు ‘గ్లోబల్ వాన్ గార్డ్’ పురస్కారాన్ని ప్రకటించింది. సినీ రంగంలో 25 ఏళ్ల ప్రస్థానం, ఆసియా-పాసిఫిక్, వెస్ట్రన్ ఇండస్ట్రీల మధ్య వారధిగా నిలిచినందుకు ఈ అవార్డు దక్కింది. మే 9న లాస్ ఏంజెల్స్‌లో జరిగే ‘గోల్డ్ గాలా 2026’ ఐదో వార్షికోత్సవ వేడుకలో ప్రియాంక ఈ సత్కారం అందుకోనుంది.