NDL: కొలిమిగుండ్ల మండల కేంద్రంలో ఈ నెల 11న రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటిస్తున్నట్లు ఇవాళ టీడీపీ మండల అధ్యక్షుడు మూలే రామేశ్వర్ రెడ్డి తెలిపారు. మండలంలో రూ.4 కోట్లతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వర్చవల్‌గా ప్రారంభిస్తారని ఆయన అన్నారు. మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు.