గుంటూరు మెడికల్ కాలేజీ వద్ద శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. భారీ వేపచెట్టు ఒక్కసారిగా బైక్‌పై కూలడంతో నగరంపాలేనికి చెందిన సాయికృష్ణ ప్రసాద్(42) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. భార్య సరిత, కుమారుడు కార్తీక్‌తో కలిసి రైల్వే స్టేషన్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సరితకు స్వల్ప గాయాలు కాగా, కుమారుడి కాలు విరిగింది.